బొండు మట్టి తవ్వకాలపై రైతుల నిరసన - బొండు మట్టి తవ్వకాలపై రైతుల నిరసన
తూర్పు గోదావరి జిల్లా కొత్తపేటలో సూర్య గుండాల పాయ నుంచి ఇళ్ల స్థలాలకు తరలిస్తున్న బొండు మట్టి తవ్వకాలను రైతులు అడ్డుకున్నారు.
ఇళ్ల స్థలాలను మెరక చేయడం కోసం బొండు మట్టిని తవ్వేందుకు అధికారులు జేసీబీలను తీసుకుని తూర్పు గోదావరి జిల్లా కొత్తపేటలో సూర్య గుండాల పాయ వద్దకు వచ్చారు. సమాచారం తెలిసుకున్న రైతులు తవ్వకాల వద్దకు చేరుకుని నిరసన తెలిపారు.
పురాణ ప్రసిద్ధి చెందిన సూర్యగుండాల పాయలో అంతిమ సంస్కారాలు, మాతా,పితృలకు పుణ్య లోకాల ప్రాప్తి కోసం తర్పణాలును వదిలి పెడతారు. దీంతో ఆప్రాంతాన్ని ప్రజలంతా కైలాసభూమిగా భావిస్తారు. మట్టి తీయడం వల్ల పాయ వెంబడి ఉన్న పంటపొలాలు పాడైపోతాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసు బందోబస్తు సాయంతో అధికారులు మట్టి తవ్వకాలు చేపట్టారు.
ఇదీ చదవండి: కరోనా వ్యాప్తితో హడలిపోతున్న అయినవిల్లి