ఇసుక విక్రయాలు జేపీ సంస్థకు అప్పగించిన తర్వాత ఇసుక ధరలు అమాంతం పెరిగిపోయాయని.. వినియోగదారులకు భారంగా మారిందని రాజమహేంద్రవరంలో బోట్స్ మెన్ సొసైటీ ప్రతినిధులు ఆరోపించారు. ప్రభుత్వానికి వెళ్లే బిల్లులో రూ.475, వినియోగదారుల బిల్లులో మాత్రం రూ.675 వసూలు చేస్తున్నారని అన్నారు. దీనివల్ల వినియోగాదారుడుకి లారీ ఇసుక రూ.తొమ్మిది వేలు ఖర్చు అవుతోందని అన్నారు. ప్రభుత్వానికి, జేపీ సంస్థకు మధ్య జరిగిన ఒప్పందాన్ని బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. జేపీ సంస్థ వసూలు చేస్తున్న నగదులో రూ.2వేలు ఎవరికి చెందుతుందోనన్న అంశం అర్థం కావడం లేదని అన్నారు.
'ప్రభుత్వం, జేపీ సంస్థకు మధ్య జరిగిన ఒప్పందాన్ని బహిర్గతం చేయాలి' - sand transport news in east godavari district
ఇసుక విక్రయాలను జేపీ సంస్థకు అప్పగించిన తరువాత ఇసుక ధరలు అమాంతం పెరిగిపోయాయని బోట్స్‌మెన్ సొసైటీ ప్రతినిధులు ఆరోపించారు. ప్రభుత్వానికి వెళ్లే బిల్లులో రూ.475, వినియోగదారులకు చెందిన బిల్లులకు మాత్రం రూ.675 వసూలు చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం, జేపీ సంస్థకు మధ్య జరిగిన ఒప్పందాన్ని బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.
బోట్స్‌మెన్ సొసైటీ ప్రతినిధులు