రాష్ట్రంలోని పాపికొండలు, భవానీ ద్వీపం, శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో పర్యాటకుల కోసం ఈ నెల 7 నుంచి బోట్లు నడిపేలా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన డివిజనల్, జిల్లా మేనేజర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. బోట్లపై నియంత్రణ, పర్యవేక్షణ కోసం తొమ్మిది చోట్ల ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్లు సమర్థంగా పని చేసేలా రెవెన్యూ, పోలీస్, విపత్తులశాఖ అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. హోటళ్లు, రిసార్ట్‌లు, ఇతర సందర్శనీయ ప్రాంతాల్లో తగు సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు.
Boating: 7 నుంచి నదుల్లో బోటు షికారు - tourisum in ap latest news
ఈ నెల 7 నుంచి నదుల్లో బోటు షికారు తిరిగి ప్రారంభంకానుంది. పాపికొండలు, భవానీ ద్వీపం, శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో పర్యాటకుల కోసం ఈ నెల 7 నుంచి బోట్లు నడిపేలా ఏర్పాట్లు చేయాలని ఆ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.సత్యనారాయణ అధికారులను ఆదేశించారు.
boating in ap