గోదావరిలో మునిగిన బోటు కోసం ఎంత ప్రయత్నించినా.. ఫలితం దక్కడం లేదు. తొలి రెండు రోజులు గాలింపు చర్యలు సాగాయి. బుధవారం మాత్రం అంతంతమాత్రంగానే గాలింపు చర్యలు చేపట్టారు. గోదావరిలో తెగిపోయిన ఇనుప రోప్ కోసం గాలించారు. బోటు గాలింపుపై పెద్దగా దృష్టి సారింలేదు. స్థానిక గిరిజనులు నాటు పడవలపై బోటు జాడ కోసం గాలించారు. అయినా పెద్దగా ప్రయోజనం లేకపోయింది. బోటును వెలికి తీసేందుకు ఇకపై ఎలాంటి ప్రయత్నాలు చేస్తారన్న అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
బోటు కోసం ఎంత వెతికినా.. ఫలించని ప్రయత్నం! - undefined
గోదావరిలో మునిగిన పర్యాటక బోటును వెలికితీసే పనుల్లో మూడో రోజూ ఎలాంటి పురోగతి లభించలేదు. కాకినాడకు చెందిన దర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించడం లేదు.
boat rescue operation
TAGGED:
boat rescue operation