తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద మునిగిన బోటు వెలికితీత పనులను మళ్లీ అంతరాయం కలిగింది. యాంకర్‌కు దొరికినట్టే దొరికి బోటు పట్టు వదిలింది. బోటులోనే మృతదేహాలు ఉంటాయని ఈతగాళ్లు బోటు దగ్గరకు వెళ్లేందుకు వెనకడుగు వేస్తున్నారు. విశాఖ నుంచి గజ ఈతగాళ్ల రాకకోసం ఎదురుచూస్తున్నారు. వారితో మాట్లాడేందుకు ధర్మాడి సత్యం విశాఖ వెళ్లారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 35 మృతదేహాలను గుర్తించారు. మరో 15 మంది వివరాలు తెలియాల్సి ఉంది.
బోటు వెలికితీత పనులకు మళ్లీ అంతరాయం - గోదావరి బోట్ న్యూస్
తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద ధర్మాడి సత్యం ఆధ్వర్యంలో బోటు వెలికితీత పనులకు అంతరాయం కలిగింది. యాంకర్ బోటు పట్టును వదిలేసింది.
కొనసాగుతున్న బోటు వెలికితీత పనులు