తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద జరుపుతున్న బోటు గాలింపు చర్యలు నిలిపివేశామని ధర్మాడి సత్యం తెలిపారు. గోదావరిలో వరద ఉద్ధృతి పెరిగినందున బోటు గాలింపు చర్యలు తాత్కాలికంగా ఆపేశామని అన్నారు. 4 రోజుల తర్వాత మళ్లీ గాలింపు చర్యలు చేపడతామని వెల్లడించారు. గత 2 రోజులుగా గాలింపు జరుపుతున్నా... ప్రయత్నాలు ఫలించలేదు. తొలి రోజు వెయ్యి మీటర్ల ఇనుప తాడు రాయికి తగిలి తెగిపోగా, ప్రస్తుతం వరద నీరు ఎక్కువగా ప్రవహిస్తున్నందున గాలింపు చర్యలకు ఆటంకం ఏర్పడింది.
నిలిచిపోయిన బోటు గాలింపు చర్యలు - 'తాత్కాలికంగా నిలిపివేసిన బోటు గాలింపు చర్యలు'
గోదావరిలో కచ్చులూరు వద్ద జరుపుతున్న బోటు గాలింపు చర్యలు తాత్కాలికంగా నిలిపేశామని ధర్మాడి సత్యం తెలిపారు.
'తాత్కాలికంగా నిలిపివేసిన బోటు గాలింపు చర్యలు'
TAGGED:
కచ్చులూరు