ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కచ్చులూరు వద్ద మరో మృతదేహం లభ్యం - ధర్మాడి సత్యం బృందం ప్రయత్నాలు

గోదావరిలో బోటును బయటకు తీసేందుకు ధర్మాడి సత్యం బృందం తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ క్రమంలో కచ్చులూరు వద్ద మరో మృతదేహాన్ని అధికారులు గుర్తించారు.

బోటు

By

Published : Oct 20, 2019, 1:57 PM IST

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిన బోటును బయటకు తీసే ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వెలికితీత పనులు చేపడుతున్న సమయంలో మరో మృతదేహం లభ్యమైంది.తల లేని బ్లాక్ జీన్స్‌ వేసుకున్న వ్యక్తి మృతదేహాన్ని అధికారులు గుర్తించారు. అది బోటు ప్రమాదంలో మరణించిన వారిదా? కాదా? అన్నది తెలియాల్సి ఉంది. మరోవైపుసంప్రదాయ పద్దతులతో ఫలితం లేనందున ధర్మాడి సత్యం బృందం స్కూబా డైవర్స్ సహాయం తీసుకొన్నారు. ఇవాళ ఉదయం కచ్చులూరు చేరుకున్న స్కూబా డైవర్స్ ఆక్సిజన్ పైపుల సహాయంతో ఇద్దరు నీటిలోని బోటు వద్దకు చేరుకున్నారు. బయటకు వచ్చి బోటు పరిస్థితిని అధికారులకు వివరించారు. స్కూబా డైవర్స్ బోటుకు ఉచ్చు వేయగలిగితే దానిని బయటకు తీయవచ్చని ధర్మాడి బృందం భావిస్తోంది.

ముమ్మరంగా బోటు వెలికితీత పనులు

ABOUT THE AUTHOR

...view details