తూర్పు గోదావరి జిల్లాలో బోటు మునిగి 12 రోజులైనా ఇంకా 15 మంది ఆచూకీ లభ్యం కాలేదు. రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో మూడు మృతదేహాలు ఉన్నాయి. కానీ అవి బోటు ప్రమాదానికి సంబంధించినవా..కాదా అనేది తేలడం లేదు. మరోవైపు కచ్చులూరు వద్ద కుండపోతగా వర్షం కురుస్తుండటంతో గాలింపు చర్యలు నిలిచిపోయాయి. బోటు వెలికితీసే ప్రయత్నాలు చేయకపోవటంతో.. తమ వారి జాడ ఏంటని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆ మూడు మృతదేహాల మాటేంటి? - గోదావరి
గోదావరిలో బోటు ప్రమాదం జరిగి 12 రోజులు గడిచినా ఇప్పటికీ మిగిలిన వారి జాడ తెలియలేదు. కనీసం ఆసుపత్రిలో ఉన్న మూడు మృతదేహాల గురించి ఏ విషయం తేల్చటం లేదు. ప్రభుత్వం పట్టించుకోవటం లేదంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
![ఆ మూడు మృతదేహాల మాటేంటి?](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4547637-344-4547637-1569413242370.jpg)
ఆ మూడు మృతదేహాల మాటేంటి?
ఆ మూడు మృతదేహాల మాటేంటి?