ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీలేరులో పడవ బోల్తా.. ఒకరి మృతదేహం లభ్యం - సీలేరు నదిలో పడవ బోల్తా

నాటు పడవ మునిగి ఇద్దరు గిరిజనులు గల్లంతైన ఘటన విశాఖ జిల్లా సీలేరులో విషాదం నింపింది. ఒడిశాలో బంధువుల ఇంటికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. ఒకరి మృతదేహం లభ్యమైంది. మరొకరి కోసం గాలిస్తున్నారు.

boat accident in sileru river and one women died in visakhapatnam
సీలేరు నదిలో పడవ బోల్తా.. ఒకరి మృతదేహం లభ్యం

By

Published : Feb 20, 2020, 1:24 PM IST

సీలేరు నదిలో పడవ బోల్తా.. ఒకరి మృతదేహం లభ్యం

విశాఖ జిల్లా సీలేరు నదిలో నాటుపడవ మునిగి ఇద్దరు గిరిజనులు గల్లంతైన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఒకరి మృతదేహం లభ్యమవగా.. మరొకరి కోసం గాలిస్తున్నారు. మ‌ర్రిగూడేనికి చెందిన ఐదుగురు గిరిజనులు.. ఆంధ్రా సరిహద్దు ఒడిశా రాష్ట్రం సన్యాసి గుడాలో బంధువులు ఇంటికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో నాటు పడవ మీద సీలేరు నది దాటుతుండగా ప్రమాదం జరిగింది. తులా, సంజూ అనే ఇద్దరు గల్లంతవగా.. ఒకరి మృతదేహం లభ్యమైంది. మరో ముగ్గురు క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details