ఆ 27 మంది బతికి ఉన్నారంటే వీళ్ల సాహసమే.... - boat accident in ap
గోదావరిలో బోటు మునిగే సమయంలో అక్కడికి సమీపంలో ఉన్న కచ్చులూరు గ్రామస్థులు వెంటనే స్పందించారు. కళ్లెదుటే మునుగుతున్న బోటును చూసి...... హుటాహుటిన నాటు పడవలపై నదిలోకి వెళ్లి 27 మందిని కాపాడారు. గోదావరిలో మునిగిపోయినవారి కోసం ఆరోజు సాయంత్రం వరకు గాలించారు. సహాయక బృందాలు రంగంలోకి దిగకముందే సాహసించి అంతమంది ప్రాణాలను కాపాడిన తమను కనీసం ఎవరూ గుర్తించలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం జరిగిన దుర్ఘటనకు సంబంధించిన వివరాలను వారి మాట్లలోనే తెలుసుకుందాం.
boat-accident-in-ap
.
Last Updated : Sep 18, 2019, 2:51 PM IST
TAGGED:
boat accident in ap