తూర్పుగోదావరి జిల్లా రాయల్ వశిష్ఠ పున్నమి పర్యాటక బోటు యజమానిని పోలీసులు అరెస్ట్ చేశారు. బోటు యజమాని కోడిగుడ్ల వెంకటరమణను అరెస్టు చేసిన పోలీసులు... మరో ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. ప్రభావతి, అచ్యుతామణి పేరిట బోటు రిజిస్ట్రేషన్ చేసినట్లు పోలీసులు తెలిపారు. రంపచోడవరం ఏఎస్పీ వకుల్ జిందాల్... వెంకటరమణను మీడియా ముందు ప్రవేశపెట్టారు. నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఏఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు.
''వశిష్ఠ పున్నమి'' బోటు యజమాని అరెస్టు - Boat Accident in ap... Boat Owner Arrested
వశిష్ఠ పున్నమి పర్యాటక బోటు యజమానిని పోలీసులు అరెస్ట్ చేశారు. బోటు యజమాని కోడిగుడ్ల వెంకటరమణతో పాటు మరో ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు.
బోటు యజమాని అరెస్టు