ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దొరకని 15 మంది ఆచూకీ... నిరీక్షణలో బంధువులు - boat accident

తీవ్ర విషాదాన్ని మిగిల్చిన గోదావరి బోటు ప్రమాదంలో గల్లంతైన వారి కోసం బంధువుల నిరీక్షణ కొనసాగుతోంది. ఆదివారం ఒక మృత దేహం లభ్యం కాగా ఇంకా 15 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది.

దొరకని 15 మంది ఆచూకీ...అంతంత మాత్రంగానే గాలింపు చర్యలు

By

Published : Sep 23, 2019, 5:30 AM IST


గోదావరి బోటు ప్రమాదం జరిగి నేటికి 9 రోజులవుతోంది. గాలింపు చర్యలు నామమాత్రంగానే జరుగుతున్నాయనే ఆరోపణలోస్తున్నాయి. గల్లంతైన ఒక మహిళ మృతదేహం ఆదివారం లభ్యమైంది. ఆ మృతదేహాన్ని ఎవరూ గుర్తించలేకపోవటంతో... రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో భద్రపర్చారు. ఇన్ని రోజుల తర్వాత ఆచూకీ లభ్యమవ్వటంతో మృతదేహాలు పూర్తిగా పాడైపోతున్నాయి. గుర్తించడం కష్టమవుతోంది. పరీక్షలు నిర్వహించిన తర్వాతే బంధువులకు అందించనున్నట్లు అధికారులు, వైద్యులు ప్రకటించారు.

దొరకని 15 మంది ఆచూకీ...అంతంత మాత్రంగానే గాలింపు చర్యలు

బోటు వెలికితీతకు సహకారం....
బోటు ప్రమాదంపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి, తూర్పుగోదావరి జిల్లా యంత్రాంగం, ఎన్డీఆర్​ఎఫ్ బృందాలతో విపత్తు నిర్వహణ కమిటీ సమావేశం నిర్వహించారు. విషాదానికి దారితీసిన పరిస్థితులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మరో సారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులను హెచ్చరించారు. బోటు వెలికితీతకు అవసరమైన సహాయ సహకారాలు కేంద్రంనుంచి అందిస్తామని అన్నారు. బోటు వెలికితీసేందుకు ఉన్న అన్ని అవకాశాలు పరిశీలించామని... నిపుణులతో చర్చించామని ఇప్పటివరకూ సాధ్యం కాలేదని తూర్పుగోదావరిజిల్లా కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి చెప్పారు.

మరో మృతదేహం లభ్యం...

తూర్పుగోదావరి జిల్లా ఎదుర్లంక వద్ద ఆదివారం రాత్రి ఒక వ్యక్తి మృతదేహం లభ్యమైంది. కచ్చులూరు బోటు ప్రమాదంలో గల్లంతైన మృతదేహంగా అధికారులు భావిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details