శబరి వంతెనను ఢీకొన్న లాంచీ.. ముగ్గురు క్షేమం.. ఒకరి గల్లంతు - boat accident in chintoor news
శబరి వంతెనను ఢీకొన్న లాంచీ.. సిబ్బంది క్షేమం
19:42 August 20
శబరి వంతెనను ఢీకొన్న లాంచీ
తూర్పుగోదావరి జిల్లా చింతూరు వద్ద శబరి నదిలో లాంచీ ప్రమాదం జరిగింది. చింతూరులో వరద బాధితులకు సరకులు ఇచ్చి తిరిగివస్తుండగా శబరి వంతెన పిల్లర్‌ను ఢీకొని లాంచీ రెండు ముక్కలైంది. ఒక భాగం కొట్టుకుపోగా మరో భాగం తిరగబడింది. లాంచీలోని నలుగురు నదిలో పడిపోయారు. వేరే పడవ సిబ్బంది వీరిలో ముగ్గురిని కాపాడారు. ఒకరు గల్లంతయ్యారు. ఒడ్డుకు చేరిన బాధితులను ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చూడండి..
Last Updated : Aug 21, 2020, 10:33 AM IST