తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో గిరి మిత్ర సంస్థ ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. ఏజెన్సీ ప్రాంతంలో అనారోగ్యానికి గురై ఎంతో మంది మృతిచెందటంతో..దాన్ని అధిగమించేందుకు ఈ సంస్థను ఏర్పాటు చేసినట్లు జగ్గారావు గణేశ్ స్వామి తెలిపారు. రక్తం అవసరమైన రోగులకు రక్తదానం చేయడంతో పాటు రక్తాన్ని సేకరించేందుకు తమ సంస్థ పోటి పడుతుందన్నారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులకు ఉన్నతాధికారులు అభినందనలు తెలిపారు.
గిరి మిత్ర సంస్థ ఆధ్వర్యంలో రక్తదానం
రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో గిరి మిత్ర సంస్థ ఆధ్వర్యంలో వెయ్యి మందికి రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కార్తీక్, గిరి మిత్ర సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
గిరి మిత్ర సంస్థ ఆధ్వర్యంలో రక్తదానం