ఆలయాల ఆస్తులు పరిరక్షించాలంటూ భాజపా.. రాజమహేంద్రవరంలో ఉపవాస దీక్ష చేపట్టింది. భాజపాతో పాటు జనసేన నాయకులు దీక్షలో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తులు విక్రయించాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం తాత్కాలికంగా కాకుండా శాశ్వతగా విరమించుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవాలయాల ఆస్తులు పరిరక్షించాలన్నారు. ఈ ఉపవాస దీక్షలో ఎమ్మెల్సీ సోము వీర్రాజుతో పాటు సత్యగోపీనాథ్‌దాస్, జనసేన నాయకుడు కందుల దుర్గేష్ తదితరులు పాల్గొన్నారు.
'తితిదే ఆస్తుల వేలం శాశ్వతంగా విరమించుకోండి' - తితిదే భూముల వేలంపై బీజేపీ కామెంట్స్
తితిదే ఆస్తుల వేలం నిర్ణయాన్ని ప్రభుత్వం శాశ్వతంగా వెనక్కితీసుకోవాలని భాజపా నేతలు డిమాండ్ చేశారు. జనసేన నేతలతో కలిసి భాజపా నాయకులు రాజమహేంద్రవరంలో ఉపవాస దీక్ష చేపట్టారు.
భాజపా నేతల ఉపవాస దీక్ష