ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉద్రిక్తతల మధ్య భాజపా ఎమ్మెల్సీ మాధవ్ అరెస్ట్ - తూర్పుగోదావరి జిల్లా వార్తలు

చలో అమలాపురం కార్యక్రమంలో భాగంగా అమలాపురం వెళ్లిన భాజపా ఎమ్మెల్సీ మాధవ్​ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు మిగతా నాయకులను పోలీస్ స్టేషన్​కు తరలించారు.

bjp mlc madhav arrest in amalapuram east godavari district
భాజపా ఎమ్మెల్సీ మాధవ్ అరెస్ట్

By

Published : Sep 18, 2020, 12:30 PM IST

భాజపా ఎమ్మెల్సీ మాధవ్ అరెస్ట్

తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి రథం దగ్ధం ఘటన క్రమంలో భాజపా చలో అమలాపురం కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ తరుణంలో అమలాపురం వెళ్లిన భాజపా ఎమ్మెల్సీ మాధవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణరాజులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీన్ని ఖండిస్తూ వారు నేలపై పడుకుని నిరసన తెలిపారు. అనంతరం వారిని పోలీసు వాహనంలో స్టేషన్​కు తరలించారు. అమలాపురంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఊరుకోమని ఏలూరు రేంజ్ డీఐజీ మోహనరావు హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details