గోదావరి వరదలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ పీవీఎం మాధవ్, రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షుడు వేటుకూరి సూర్యనారాయణ రాజు డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలంలోని ముంపు ప్రాంతాలను మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యజీ వేమ, భాజపా నేత పాలూరు సత్యానందరావులతో కలసి పరిశీలించారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఎమ్మెల్సీ పీవీఎం మాధవ్ మాట్లాడుతూ... అరటి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. అరటి గెలలు కోసినా గిట్టుబాటు ధర లేదని రైతులు ఆవేదన చెందుతున్నారన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. కంద, బత్తాయి తోటలకు అధిక మొత్తంలో నష్టం వాటిల్లిందన్న మాధవ్... ప్రభుత్వం వారికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.