ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

న్యాయం అడిగితే.. అరెస్టు చేస్తారా? - bjp on antharvedi ratham fire

తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి రథం దగ్థం విషయంలో న్యాయం అడిగితే అరెస్టులు చేస్తారా అని భాజపా నేతలు ప్రశ్నించారు. రథం దగ్థం చేసిన దోషులను అరెస్టు చేసి న్యాయం చేయాలని కోరారు.

bjp leaders fires on antharvedi ratham fire
అంతర్వేది రథం దగ్ధంపై భాజపా నేతలు

By

Published : Sep 9, 2020, 12:29 PM IST

తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి రథం దగ్థం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత దారుణంగా వ్యవహరిస్తోందని భాజపా రాష్ట్ర పదాధిపతి తమనంపూడి రామకృష్ణారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పాలూరి సత్యానంద అన్నారు. 62 సంవత్సరాలు చరిత్ర కలిగిన రథం దగ్థం చేసిన దోషులను అరెస్టు చేసి న్యాయం చేయాలని అడిగేందుకు వెళ్తుంటే భాజపా, జనసేన, ఆర్‌ఎస్ఎస్‌ కార్యకర్తలను అరెస్ట్ చేయడం తగదన్నారు. రాష్ట్రంలో చాలా చోట్ల దేవాలయాలపై ఇటువంటి ఘటనలు జరుగుతుంటే పిచ్చివాళ్లు చేశారని ప్రచారం చేయడం దారుణమన్నారు. ఉద్యమాన్ని అణిచివేయాలని చూస్తే ఊరుకోమని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details