ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 27, 2020, 7:19 PM IST

ETV Bharat / state

'కోనసీమ రైల్వేలైన్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం వాటా చెల్లించాలి'

తూర్పుగోదావరి జిల్లా కోనసీమ రైల్వే లైన్ నిర్మాణంలో ప్రభుత్వం తన వాటా చెల్లించాలని.. భాజపా జాతీయ నాయకుడు వారణాసి రామ్ మాధవ్ డిమాండ్ చేశారు. రైల్వేలైన్ నిర్మాణ పనులకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన వాటాపై సీఎంతో చర్చిస్తానని ఆయన తెలిపారు.

bjp leader varanasi rammadhav speaks on konaseema railway line at east godavari
'కోనసీమ రైల్వేలైన్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం వాటా చెల్లించాలి'


తూర్పుగోదావరి జిల్లా కోనసీమ రైల్వే లైన్ నిర్మాణంలో ప్రభుత్వం తన వాటా చెల్లించాలని.. భాజపా జాతీయ నాయకుడు వారణాసి రామ్ మాధవ్ డిమాండ్ చేశారు. రైల్వే లైన్ నిర్మాణానికి.. కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు రూ.1600 కోట్లు విడుదల చేసిందని ఆయన తెలిపారు. అనంతరం రాజోలులోని కుచ్చర్లకోటలో.. రామరాజు ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించనున్న అన్నదాన సత్రానికి భూమి పూజ చేశారు.

కోనసీమ రైల్వే లైన్ పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం దృఢసంకల్పంతో ఉందని రామ్ మాధవ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన వాటా విషయంపై తాను సీఎం జగన్​తో చర్చిస్తానని తెలిపారు.

కోనసీమ రైల్వేలైన్ నిర్మాణం ద్వారా ఈ ప్రాంతం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ ప్రాజెక్టు కోనసీమ ప్రాంతవాసుల చిరకాల వాంఛ అని అన్నారు. రైల్వేలైన్ నిర్మాణం నిర్ణీత గడువులో పూర్తవుతుందని.. ఈ విషయంలో తన సహకారం ఎప్పుడూ ఉంటుందని రామ్ మాధవ్ వెల్లడించారు.

ఇదీ చదవండి:

స్వర్ణ భారత్ ట్రస్ట్​కు చేరుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

ABOUT THE AUTHOR

...view details