జాతీయ పౌరసత్వ సవరణ చట్టాన్ని సమర్థిస్తూ.. కాకినాడలో భాజపా ఏక్తా యాత్ర నిర్వహించింది. భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహరావు, ఎమ్మెల్సీ సోమువీర్రాజు, ఇతర నాయకులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. భానుగుడి కూడలి నుంచి బాలాచెరువు వరకూ ర్యాలీ జరిగింది. జాతీయ పౌర జాబితాలో ఎలాంటి లోపాలు లేవని... పొరుగు దేశాల్లో వేధింపులు తట్టుకోలేక భారత్‌కు తిరిగి రావాలనుకున్న ముస్లిమేతరులకు ఈ చట్టం వరప్రదాయని అని జీవీఎల్ వివరించారు. చట్టంలో లోపాలుంటే సవరించుకునేందుకు భాజపా ముందుంటుందని చెప్పారు. రాహుల్‌గాంధీ, మమతాబెనర్జీ, సోనియాగాంధీ ఈ చట్టంపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తప్పుడు ప్రచారాలు చేస్తున్న కారణంగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు సోమువీర్రాజు చెప్పారు.
కాకినాడలో భాజపా ఏక్తా యాత్ర..!
జాతీయ పౌరసత్వ సవరణ చట్టాన్ని సమర్థిస్తూ... కాకినాడలో భాజపా ఏక్తా యాత్ర నిర్వహించింది. 50 మీటర్ల జాతీయ జెండాతో భారీ ప్రదర్శన చేసింది.
bjp caa supporting rally at kakinada