ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలవరం కాలువ గట్టుపై గొర్రగేదె సంచారం - east godavari district latest news

తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం గాదెలపాలెం - తంటికొండ గ్రామాల మధ్య పోలవరం కాలువ గట్టుపై అడవిదున్నను పోలిన జంతువు సంచరించడాన్ని స్థానికులు గమనించారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.

bison roaming on the banks of the Polavaram canal
కాలువ గట్టుపై గొర్రగేదె

By

Published : Apr 19, 2021, 11:59 AM IST

తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం గాదెలపాలెం- తంటికొండ గ్రామాల మధ్య పోలవరం కాలువ గట్టుపై నిన్న రాత్రి అడవిదున్నను పోలిన జంతువు(గొర్రగేదె) సంచరించడాన్ని స్థానికులు చూశారు. ఈ విషయాన్ని గోకవరం అటవీశాఖ సెక్షన్‌ అధికారి శివప్రసాద్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన హుటాహుటిన సిబ్బందితో ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ముందుగా కాలువ గట్టు చుట్టుపక్కల గ్రామాలైన పెదరమణయ్యపేట, గోపాలపురం, గాదెలపాలెం పరిసర ప్రజలు కాలువ గట్టుపై వెళ్లకుండా రాకపోకలు నిలిపివేశారు. ఈ సందర్భంగా ఆయన ‘న్యూస్‌టుడే’ తో మాట్లాడుతూ వేసవి కావడంతో దాహార్తి తీర్చుకోవడానికి కొండలపై సంచరించే గొర్రగేదెలు ఇలా కాలువల వైపు వస్తున్నాయని స్థానికులు చెబుతున్నారన్నారు.

ABOUT THE AUTHOR

...view details