తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం సీఐటియూ ఆధ్వర్యంలో కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 95వ వర్ధంతి నిర్వహించారు. సీఐ వి. కృష్ణ, అంగన్వాడి, ఆశా కార్యకర్తలు, ఆర్టీసీ కార్మికులు హాజరయ్యారు. రహదారులపై వెళ్లేవారికి బిర్యాని ప్యాకెట్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ వలస కూలీలకు పలు చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమన్నారు. జాతీయ రహదారిపై 40 కిలో మీటర్లకు ఒక శిబిరాన్ని తుని వరకు ఏర్పాట్లు చేసినట్లు సీఐటీయూ జిల్లా కార్యదర్శి బలరామ్ అన్నారు.