ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బైకుల చోరీలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్

తూర్పుగోదావరి జిల్లాలో ద్విచక్రవాహనాలే లక్ష్యంగా చోరీకి పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఏడుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుల నుంచి ఆరు బైకులు, ఓ కారు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

By

Published : Feb 8, 2021, 6:18 PM IST

bikes theft gang arrest
బైకుల చోరీలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్

తూర్పుగోదావరి జిల్లాలో బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ఏడుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేసినట్లు రాజమహేంద్రవరం తూర్పు జోన్ డీఎస్పీ రవికుమార్ తెలిపారు. నిందితుల నుంచి ఆరు ద్విచ్రవాహనాలు, కారు స్వాధీనం చేసుకున్నట్లు బొమ్మూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముఠా వివరాలను వెల్లడించారు.

'భీమవరం, ఏలూరు, తదితర ప్రాంతాకు చెందిన ఏడుగురు ఓ ముఠాగా ఏర్పడ్డారు. ఈ ముఠా.. తాపేశ్వరం, రావులపాలెం, రాజానగరం, సూరంపాలెం, జగ్గంపేట, గాడాల తదితర ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడింది. రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో ఎటీఎంలలో నగదు చోరీకి ప్రయత్నించింది. బాధితుల నుంచి ఫిర్యాదులు రావడంతో చోరీలపై నిఘా పెట్టిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా ముఠాను అరెస్టు చేశారు. ఈ ముఠాలో ఓ మహిళ కూడా ఉండటం విశేషం. నిందితులపై కేసు నమోదు చేశాం. వాళ్ల నుంచి బైకులు, కారు స్వాధీనం చేసుకున్నాం' అని డీఎస్పీ రవికుమార్ వెల్లడించారు.

ఇదీ చదవండి:ఆటో బోల్తా.. ఒకరు మృతి, నలుగురికి తీవ్ర గాయాలు

ABOUT THE AUTHOR

...view details