అధిక ఉష్ణోగ్రతతో ద్విచక్ర వాహనంలో మంటలు - kirlampudi
రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. పలు ప్రాంతాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండల తీవ్రతతో అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి. అధిక ఉష్ణోగ్రత కారణంగా కిర్లంపూడి రహదారిలో ద్విచక్ర వాహనం మంటల్లో చిక్కుకొని పూర్తిగా దగ్ధం అయ్యింది.
ద్విచక్ర వాహనంలో మంటలు
తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలం రాజపాలెం గ్రామానికి చెందిన ఓ యువకుడి ద్విచక్ర వాహనం బుధవారం అగ్నికి ఆహుతి అయ్యింది. యువకుడు తమ స్వగ్రామం నుంచి కిర్లంపూడి వెళ్తుండగా పెట్రోలు లీక్ అయ్యి...ఎండ తీవ్రతతో ఒక్కసారిగా నిప్పు అంటుకుంది. మంటలు గమనించిన యువకుడు వాహనాన్ని వదిలిపెట్టి దూరంగా వెళ్లి... ప్రమాదం నుంచి బయటపడ్డాడు. మంటల్లో వాహనం పూర్తిగా దగ్ధమైంది.