రైళ్లన్నీ రద్దయిన కారణంగా.. దూర ప్రాంతాల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాజమహేంద్రవరంలోని గురుకులం పాఠశాలలో చదివే బిహార్‌కు చెందిన విద్యార్ధులు స్వస్థలాలకు వెళ్లడానికి మార్గం లేక రైల్వేస్టేషన్ వద్దే ఉండిపోయారు. ముందుగా రిజర్వేషన్ చేసుకున్న వారు రైల్వేస్టేషన్‌కు వచ్చి రైళ్ల గురించి ఆరా తీశారు. అన్నీ రద్దు చేశారని తెలుసుకున్న బిహార్ విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్‌లోనే పడిగాపులు పడాల్సి వచ్చింది. తాము స్వస్థలాలకు చేరుకోవడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్లో బిహార్ విద్యార్థుల పడిగాపులు
వారంతా పాఠశాల విద్యార్థులు. కరోనా ప్రభావంతో సెలవులిచ్చిన కారణంగా.. ఇళ్లకు బయలుదేరారు. తీరా స్టేషన్‌కు వెళ్లేసరికి రైళ్లన్నీ రద్దయ్యాయని తెలుసుకున్నారు. తిందామాంటే తిండి దొరకడం లేదు. ఉందామంటే హోటళ్లన్నీ మూసేశారు. ఆగమ్యగోచరంగా తయారైంది వారి పరిస్థితి. ఎటు వెళ్లాలో తెలియక రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్లో పడిగాపులు కాస్తున్నారు బిహర్‌కు చెందిన విద్యార్థులు.
రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్లో బిహార్ విద్యార్థుల పడిగాపులు