ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Big Conch: రూ. 18 వేలు పలికిన శంఖం..దాని ప్రత్యేకత ఏంటంటే..!

తూర్పుగోదావరి జిల్లాలో చేపల వేటకు వెళ్లిన ఓ మత్స్యకారుడికి అనుకోకుండా 3 కిలోల భారీ శంఖం(Big Conch) లభించింది. అత్యంత అరుదుగా దొరికే ఇలాంటివాటిలో లక్షల విలువైన ముత్యాలు ఉంటాయని అందరూ భావిస్తున్నారు. దీనిని అమ్మేందుకు అక్కడ వేలం(Auction) కూడా నిర్వహించారు.

big conch found by a fisher man
big conch found by a fisher man

By

Published : Jun 26, 2021, 3:39 PM IST

రూ. 18 వేలు పలికిన శంఖం

తూర్పుగోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ చేపలరేవులో వేటకు వెళ్లిన ఓ మత్స్యకారుడికి 3 కిలోల బరువున్న శంఖం(Big Conch) లభ్యమైంది. బోటులో ఉదయం వేటకు వెళ్లిన జగన్నాథం.. చేపలకోసం వేసిన వలలో శంఖం చిక్కింది. సముద్రంలో లభ్యమయ్యే ఇలాంటి శంఖాల్లో విలువైన ముత్యాలు ఉంటాయని అంచనా. శంఖాన్ని రేవుకు చేర్చి వేలం నిర్వహించగా.. కొనుగోలుకు వ్యాపారులు పోటీపడ్డారు. చివరకు జగదీష్ అనే వ్యాపారి.. రూ. 18 వేలకు దానిని దక్కించుకున్నాడు. శంఖంలో ముత్యాలుంటే లక్షల్లో లాభాలు వస్తాయని అందరూ అనుకుంటున్నారు. ఇంతకీ అందులో ఏముందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details