తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలు జలాశయాలను నింపుతున్నాయి. రంపచోడవరం మండలం భూపాతిపాలెం జలాశయానికి భారీగా వరద చేరింది. జలాశయం సామర్థ్యం 204 అడుగులు కాగా.. ప్రస్తుతం 203.5 అడుగులుగా నీటిమట్టం కొనసాగుతోంది. భారీ వరద జలాశయానికి చేరుతున్న పరిస్థితుల్లో... 100 క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న సీతపల్లి వాగులోకి విడుదల చేసినట్లు డీఈ మాధవరావు తెలిపారు.
భూపాతిపాలెం జలాశయం నుంచి నీటి విడుదల - Bhupathipalem Reservoir Releases news
తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో.. ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. రంపచోడవరం భూపతిపాలెం జలాశయానికి భారీగా వరద చేరిన కారణంగా.. నీటిని కిందకు వదిలారు.
![భూపాతిపాలెం జలాశయం నుంచి నీటి విడుదల](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4696157-163-4696157-1570600378633.jpg)
భూపాతిపాలెం జలాశయం..నీరు విడుదల
Last Updated : Oct 9, 2019, 12:28 PM IST