ద్రాక్షారామం శ్రీమాణిక్యాంబ సమేత భీమేశ్వరస్వామి కల్యాణోత్సవాల్లో భాగంగా సప్తగోదావరి పుష్కరిణిలో తెప్పోత్సవం కన్నుల పండువగా జరిగింది. .
ద్రాక్షారామం
By
Published : Feb 21, 2019, 4:01 AM IST
తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామం శ్రీమాణిక్యాంబ సమేత భీమేశ్వరస్వామి వారి కల్యాణోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి.
భీమేశ్వరస్వామి తెప్పోత్సవం
పల్లకిలో స్వామి అమ్మవార్లను పుష్కరిణి వరకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. సప్తగోదావరి పుష్కరిణిలో హంసవాహనంపై దేవదేవులువిహరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామి తెప్పోత్సవాన్ని తిలకించారు. అధికారులు బాణాసంచా కాల్చారు.