తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం ర్యాలిలోని భారత్ టాలెంట్స్ అసోసియేషన్, శ్యామ్ జాదూగర్ మాయాబడి ఆధ్వర్యంలో నాల్గో జాతీయ భారత్ టాలెంట్స్ చిల్డ్రన్ ఫెస్ట్ 2020 నిర్వహించారు. బాలల దినోత్సవం సందర్భంగా అధ్యక్షుడు చింత శ్యామ్ జాదూగర్ పర్యవేక్షణలో ఆన్లైన్ ద్వారా ఈ కార్యక్రమం జరిగింది.
ఆన్లైన్ వేదికగా భారత్ టాలెంట్స్ చిల్డ్రన్ ఫెస్ట్-2020
బాలల దినోత్సవం సందర్భంగా భారత్ టాలెంట్స్ చిల్డ్రన్ ఫెస్ట్-2020 ఘనంగా నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలిలో ఆన్లైన్ ద్వారా ఈ కార్యక్రమం జరిగింది.
నెహ్రూ వేషధారణలో భారత్ టాలెంట్స్ చిల్డ్రన్ ఫెస్ట్‌లో పాల్గొన్న చిన్నారులు
వివిధ దేశాల్లో స్థిరపడిన తెలుగువారు ఫెస్ట్‌కి హాజరయ్యారు. నెహ్రూ వేషధారణ అలంకరించుకుని.. 528 మంది చిన్నారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. విశేష ప్రతిభ కనబరిచిన ముప్పై మందిని ఎంపిక చేశారు. వారిలో 21 మందికి 'భారత్ టాలెంట్స్ బాల నెహ్రు'.. తొమ్మిది మందికి 'భారత్ టాలెంట్స్ బాల శ్రీ' అవార్డులను ఆన్లైన్లో అందించారు.
ఇదీ చదవండి: బాల్యం స్వభావాన్ని కరోనా మార్చేసింది... ఆ జ్ఞాపకాలు లేకుండా చేసింది!