కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ వామపక్ష, కార్మిక సంఘాలు పిలుపునిచ్చిన దేశ వ్యాప్త బంద్...జిల్లా వ్యాప్తంగా కొనసాగింది. ముమ్మిడివరంలో పలు కార్మిక సంఘాలకు చెందిన నాయకులు ప్రధాన రహదారిపై నిరసనకు దిగారు. రాజమహేంద్రవంలో ఆజాద్ చౌక్‌లో రిలే దీక్షలు చేస్తున్న ముస్లింలు భారీ ర్యాలీ చేపట్టారు. పౌరసత్వ సవరణ చట్టంతో పాటు ఎన్ఆర్సీ బిల్లులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
జిల్లాలో ప్రశాంతంగా సాగిన 'భారత్ బంద్' - సీఏఏ, ఎన్నార్సీ చట్టం
కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ వామపక్షాలు పిలుపునిచ్చిన భారత్ బంద్ ప్రశాంతంగా సాగింది. రాజమహేంద్రవరం, ముమ్మిడవరంలో నిరసన ర్యాలీలు చేపట్టారు.
తూర్పుగోదావరిలో ఎన్నార్సీ, సీఏఏ బిల్లులను రద్దు చేయాలంటూ ధర్నాలు