రాష్ట్రంలో 25 నెలల్లో అధికార మార్పిడి జరుగుతుందని భాజపా అధికార ప్రతినిధి భానుప్రకాశ్‌రెడ్డి జోస్యం చెప్పారు. వైకాపా పాలన పట్ల ప్రజలు విసిగిపోయారని అన్నారు. ఎందుకు ఓట్లేశామా అని ప్రజలు బాధపడుతున్నారని రాజమహేంద్రవరంలో అన్నారు. ఈ 16 నెలల కాలంలో ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని.. నిధుల ఖర్చుపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రం ఇప్పటికే అప్పుల్లో ఉంటే.. దివాళా తీసేలా మరిన్ని అప్పులు తెస్తున్నారని అన్నారు. నామినేటెడ్ పదవుల్లో 60 నుంచి 70 శాతం ఒకే సామాజిక వర్గానిక కట్టబెట్టారని ఆరోపించారు. భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి పురందరేశ్వరిపై విజయసాయి వ్యాఖ్యలు సరికాదన్నారు. రాజమహేంద్రవరంలో మాజీ కార్పొరేటర్ కురగంటి సతీశ్ భానుప్రకాష్‌రెడ్డి ఆధ్వర్యంలో భాజపాలో చేరారు.