ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గంగపుత్రుల వలలో సక్కర్ ఫిష్ - Sucker fish latest News

పశ్చిమ బంగా నుంచి ఫిష్ సీడ్​లో ఆంధ్రకు తరవచ్చిన తెలుపు నలుపు చారలు కలిగిన చేపలు గంగపుత్రుల వలకు చిక్కాయి. వీటిని సక్కర్ ఫిష్ అంటారని మత్స్యశాఖ అధికారులు తెలిపారు.

గంగపుత్రుల వలలో బెంగాళీ చేపలు
గంగపుత్రుల వలలో బెంగాళీ చేపలు

By

Published : Apr 13, 2021, 10:06 PM IST

తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలం మానేపల్లిలోని పంట కాల్వలో తెలుపు నలుపు చారలు కలిగిన చేపలు గంగపుత్రుల వలలో చిక్కాయి. వీటిని సక్కర్ ఫిష్ అని అంటారని రాజోలుకు చెందిన మత్స్య శాఖ సహాయ సంచాలకుడు బి. కృష్ణారావు తెలిపారు.

'అక్కడ్నుంచి తరలివచ్చాయి'

వీటి శాస్త్రీయ నామం "హైపోస్థొమస్- ప్లేకొస్థొమస్" అని ఆయన పేర్కొన్నారు. ఇవి ఎక్కువగా బంగ్లాదేశ్​లో ఉంటాయన్నారు. పశ్చిమ బంగాకు దగ్గరగా ఉండే ఈ రకం చేపలు, కోల్​కతా నుంచి ఆక్వా సీడ్​లో కలిసిపోయి ఆంధ్రకి వచ్చాయని వివరించారు. ఈ చేపలు చెరువుల్లో చేరితే ఆక్వా రైతులకు భారీ నష్టం కలుగుతుందని స్పష్టం చేశారు.

ఇవీ చూడండి : ఎవరిని కొడతారో చూద్దామా..?: రేవంత్​

ABOUT THE AUTHOR

...view details