రేషన్ సరుకులు తమకు సక్రమంగా అందించడం లేదని తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలం ఏ.కొత్తపల్లిలో లబ్ధిదారులు ఆందోళన చేపట్టారు. గ్రామంలోని 150 కుటుంబాలకు గత నెల రేషన్ అందించలేదని వారు వాపోయారు. దీనిపై ఎటువంటి సమాధానం చెప్పకుండా ఈ నెల సరుకులు ఇస్తున్నారని ఆరోపించారు. గత నెల రేషన్ కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత నెలలో సర్వర్ సమస్య వల్ల కొన్ని కుటుంబాలకు రేషన్ ఇవ్వలేకపోయామని మండల సరఫరా అధికారి రామారావు స్పష్టం చేశారు.
రేషన్ సక్రమంగా అందటం లేదని లబ్ధిదారుల ఆందోళన - కొత్తపల్లి తాజా సమాచారం
తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లిలో రేషన్ సక్రమంగా అందటం లేదని లబ్ధిదారులు ఆందోళన చేపట్టారు. గత నెలలో రేషన్ అందించలేదని 150 కుటుంబాల వారు వాపోయారు. ఈ నెల రేషన్తో పాటు గత నెల రేషన్ కూడా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.
![రేషన్ సక్రమంగా అందటం లేదని లబ్ధిదారుల ఆందోళన concern](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11978391-179-11978391-1622547597219.jpg)
ఆందోళన