గడువుకు ముందే బిక్కవోలు రైల్వే లూప్‌లైన్ పనులు పూర్తి - తూర్పు గోదావరి వార్తలు
తూర్పు గోదావరి జిల్లాలోని బిక్కవోలు రైల్వేస్టేషన్‌లో నిర్మించిన పొడవైన లూప్‌లైన్‌ను ప్రారంభించినట్లు రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. దీనితో పాటు విజయవాడ రైల్వే డివిజన్‌లో ఆరు చోట్ల పొడవైన లూప్ లైన్ల నిర్మాణానికి అనుమతినిచ్చినట్లు పేర్కొంది. బిక్కవోలులో గడువుకు ముందే పనిని పూర్తి చేశామని అధికారులు చెప్పారు.
దక్షణ మధ్య రైల్వే పరిధిలోని బిక్కవోలు రైల్వేస్టేషన్‌లో నిర్మించిన పొడవైన లూప్‌లైన్‌ను ప్రారంభించినట్లు రైల్వే మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది. రైళ్ల రాకపోకలను సులభతరం చేయడానికి వీటిని వినియోగిస్తారు. సాధారణంగా లూప్‌లైన్లను 750 మీటర్ల పొడవున నిర్మిస్తారు. కానీ బిక్కవోలులో మాత్రం రూ. 85 కోట్ల వ్యయంతో 1,500 మీటర్లు నిర్మించారు. బిక్కవోలుతో పాటు విజయవాడ రైల్వే డివిజన్‌లో ఆరు చోట్ల పొడవైన లూప్ లైన్ల నిర్మాణానికి రైల్వే శాఖ అనుమతినిచ్చింది. బిక్కవోలులో గడువుకు ముందే పని పూర్తి చేశామని రైల్వే అధికారులు పేర్కొన్నారు.