ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చనిపోయిన భిక్షగాడి సంచిలో లక్షా 80వేలు - తూర్పుగోదావరి జిల్లా

రాజమండ్రి మార్కేండేయ స్వామి ఆలయం వద్ద గుండెపోటుతో మృతి చెందిన భిక్షగాడి సంచిలో లక్షా 80 వేల నగదు కనిపించడం సంచలనం సృష్టించింది. ఆ నగదును అనాథశరణాలయానికి వాడాలని స్థానికులంటున్నారు.

అడుక్కునేవాడి దగ్గర అక్షరాల లక్షా 80వేల రూపాయిలా

By

Published : Aug 24, 2019, 5:39 PM IST

అడుక్కునేవాడి దగ్గర అక్షరాల లక్షా 80వేల రూపాయిలా

ఓ ఆలయం వద్ద చనిపోయిన భిక్షగాడి వద్ద లక్షా80వేల నగదు లభించడం,రాజమండ్రిలో సంచలనం సృష్టించింది.రాజమండ్రిలోని మార్కెండేయ స్వామి ఆలయం వద్ద ప్రతి రోజు భిక్షాటన చేసే వ్యక్తి నిన్న గుండె పోటుతో మరణించాడు.అతన్ని చూసేందుకు వచ్చిన స్థానికులుకు బిచ్చగాడి సంచిలోని లక్షా80వేలను చూసి,ఒక్కసారిగా అవాక్కైయ్యారు.భక్తులు వేసిన ప్రతి పైసా కూడపెట్టుకుని ఇంత డబ్బుపోగు చేశాడని స్థానికులంటున్నారు.ఈ నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు,అతనికి సంబంధించిన వ్యక్తులు ఎవరైన వస్తే అందిస్తామని చెబుతున్నారు.కానీ,స్థానికులు మాత్రం అనాథ అయిన ఆ భిక్షగాడి సొమ్మును అనాథశరణాలయానికి వినియోగించటమే సముచితమని అభిప్రాయపడుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details