చిన్న అంతర్వేదిగా ప్రసిద్ధి పొందిన తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం ఉడిముడిలో కొలువైన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి కల్యాణం నేత్రపర్వంగా కొనసాగింది. మాఘ శుద్ధ ఏకాదశి పర్వదినం సందర్భంగా అర్చకులు స్వామివారి కల్యాణం నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున కల్యాణంలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఈ నెల 28 వరకు స్వామివారి కల్యాణోత్సవాలు జరగనున్నట్లు ఆలయార్చకులు తెలిపారు.
అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో