తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమ అందాలు ఎంతచూసినా తక్కువే. శీతాకాలంలో ఈ ప్రాంత సోయగాలు చూపరులను మరింత మైమరపిస్తాయి. వేకునజామున పచ్చని చెట్లపై తెల్లని మంచు మెరుస్తూ కనులవిందుగా కనిపిస్తుంది. సొగసు చూడతరమా..అంటూ ప్రకృతి ప్రేమికులు మురిసిపోతారు. స్వర్గం ఇక్కడే ఉందన్నట్లుగా తన్మయం చెందుతారు.
మంచుకురిసే వేళలో కోనసీమ అందాలు.. - beauty of konaseema
ప్రకృతి సోయగాలకు పెట్టింది పేరు కోనసీమ.ఎప్పుడూ పచ్చదనంతో కళకళలాడే ఈ ప్రాంతం ఇప్పుడు మరింత శోభాయమానంగా కనిపిస్తుంది. మంచు దుప్పటి కప్పుకుని చూపరులను ఆకట్టుకుంటోంది.
పచ్చదనాన్ని కమ్మేసిన మంచుదుప్పటి