విశాఖ మన్యం రోజురోజుకూ కొత్త అందాలను సంతరించుకుంటోంది. ఎత్తైన కొండల మధ్యలో సువర్ణ ఆకాశంలో సూర్యోదయం చూసేందుకు పర్యాటకులు పోటీపడ్డారు. సూర్యోదయం, అస్తమయం, వెన్నెల అందాలు కొండల్లో పరుచుకుంటున్నాయి.
ఈ ప్రకృతి అందాన్ని తిలకించేందుకు... వేకువజాము నుంచే సాహసించి వంజంగి కొండలు చేరుకుంటున్నారు పర్యాటకులు. సూర్యోదయం వేళ దేదీప్య మైన కాంతులతో వినీలాకాశం తన్మయత్వానికి గురిచేసింది.