తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం మన్యంలో పొగమంచు సోయగాలు.. ఆహ్లాదాన్ని పంచాయి. నీటిమీద తేలియాడే మబ్బుల ప్రతిబింబాలు, కొండలను కమ్ముకున్న పొగమంచు అలలు ఒకదానికొకటి పోటీపడుతూ.. అందాలను ఒలకబోశాయి.
పగలు ఎండ , రాత్రి వర్షం రావడంతో తెల్లవారుజామున కొండలపై పొగమంచు ఆహ్లాదాన్ని పంచింది. ఏజెన్సీలో భూపతిపాలెం, మూసురుమిల్లి జలాశయాల వద్ద, మారేడుమిల్లి వెళ్లే మార్గంలో ఈ దృశ్యాలు కనువిందు చేశాయి.