ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కనీస వసతులు కల్పించాలంటూ మహిళా కార్మికుల ఆందోళన - కోప్పవరం బీడీఎచ్ మహిళా కార్మికుల ఆందోళన వార్తలు

తాము పనిచేసే చోట కనీస వసతులు లేవని.. అవి కల్పించే వరకు విధులకు హాజరయ్యేది లేదని చెబుతూ.. తూర్పుగోదావరి జిల్లా కోప్పవరం బీడీఎహెచ్ ఆగ్రో ఫ్యాక్టరీ మహిళా కార్మికులు ఆందోళన చేపట్టారు. గేటు ముందు నిలబడి నినాదాలు చేశారు.

bdl agro industries women workers protest in koppavaram east godavari district
కనీస వసతులు కల్పించాలంటూ మహిళా కార్మికుల ఆందోళన

By

Published : Jun 16, 2020, 8:36 PM IST

ఫ్యాక్టరీలో మహిళా కార్మికులకు కనీస వసతులు కల్పించాలని, జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ.. తూర్పుగోదావరి జిల్లా కోప్పవరం బీడీఎచ్ ఆగ్రో ఇండస్ట్రీస్​లో పనిచేసే మహిళలు ఆందోళన చేపట్టారు. తాము పనిచేసే చోట కనీస వసతులు లేవన్నారు. జీతాలు పెంచేవరకు విధులకు హాజరవ్వమంటూ ఫ్యాక్టరీ గేటు ముందు నిలబడి నినాదాలు చేశారు.

విషయం తెలుసుకున్న మాజీ సర్పంచ్ వెంకటరామకృష్ణారెడ్డి వచ్చి లేబర్ కాంట్రాక్టర్​తో సమస్యపై చర్చించారు. ఈనెల 25న గ్రామపెద్దలతో చర్చించి సమస్య పరిష్కారిస్తామని చెప్పటంతో మహిళలు నిరసన విరమించి విధులకు హాజరయ్యారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details