ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఆ వ్యాఖ్యలు బలహీన వర్గాల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయి' - కాకినాడ నేటి వార్తలు

స్వాతంత్ర్య సమరయోధుడు గౌతు లచ్చన్న విగ్రహాన్ని తొలగిస్తామన్న మంత్రి అప్పలరాజు వ్యాఖ్యలపై బీసీ సంఘాల నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. మంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

bc unions fire on minister appalaraju
తెలుగు జనతా పార్టీ నాయకులు వెంకటేశ్వరరావు

By

Published : Dec 24, 2020, 11:30 PM IST

శ్రీకాకుళం జిల్లా పలాసలో స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహాన్ని తొలగిస్తామని మత్స్యశాఖ మంత్రి అప్పలరాజు ప్రకటించడంపై బీసీ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడలో నిర్వహించిన సమావేశంలో తెలుగు జనతా పార్టీ నాయకులు వెంకటేశ్వరరావు తీవ్రంగా ఖండించారు. మంత్రి వ్యాఖ్యలు బలహీన వర్గాల ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని అన్నారు. మంత్రి అప్పలరాజు తక్షణం క్షమాపణ చెప్పాలని, లేకపోతే ఆయనపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లలో కేసులు పెడతామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details