ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వామనరావు దంపతులపై దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి'

తెలంగాణలో హత్యకు గురైన న్యాయవాదులు వామనరావు దంపతులపై దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని రంపచోడవరం బార్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు. దాడిని ఖండిస్తూ రంపచోడవరం కోర్టు ఎదుట న్యాయవాదులు నిరసన తెలిపారు.

bar council of rampachodavaram
రంపచోడవరం బార్ అసోసియేషన్ సభ్యులు

By

Published : Feb 19, 2021, 8:22 PM IST

తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయవాదులు వామనరావు దంపతులపై అమానుషంగా దాడి చేసి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం బార్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు. న్యాయవాదులపై జరిగిన దాడిని ఖండిస్తూ రంపచోడవరం కోర్టు ఎదుట న్యాయవాదుల నిరసన తెలిపారు. తక్షణమే ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసే విచారణ వేగవంతం చేయాలన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details