అకస్మాత్తుగా కురిసిన వర్షం, ఈదురుగాలులు... లంకప్రాంతాల్లోని అరటి పంటలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని రావులపాలెం, ఆత్రేయపురం, కొత్తపేట, ఆలమూరు మండలాల్లో రైతులు అరటి సాగు చేస్తున్నారు. పంట చేతికందే సమయంలో ఒక్కసారిగా వీచిన ఈదురు గాలులతో చెట్లన్నీ నేలకొరిగి... తీవ్రనష్టాన్ని చేకూర్చాయి. ఇప్పటి వరకూ కంటికి రెప్పలా కాపాడుకున్న పంట... నేల పాలైన పరిస్థితుల్లో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అరటి రైతన్నలకు 'ఈదురు' దెబ్బ
గురువారం వీచిన ఈదురుగాలులకు లంక ప్రాంతాల్లో అరటి రైతులు తీవ్రంగా నష్టపోయారు. అప్పటివరకూ కంటికిరెప్పలా కాపాడుకున్న పంట... ప్రకృతి ప్రకోపంతో నేలకొరిగింది.
అరటి రైతన్నలకు 'ఈదురు' దెబ్బ