తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలంలోని లంక ప్రాంతాల్లో ఈదురు గాలుల కారణంగా అరటి తోటలు నేలకొరిగాయి. కరోనా ప్రభావంతో ఎగుమతులు నిలిచిపోయి అరటి ధర పతనమైంది. ఇదే సమయంలో గాలుల కారణంగా చాలా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ప్రభుత్వం, అధికారులు ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
ఆలమూరులో ఈదురుగాలులు..అరటి తోటలు ధ్వంసం - banana crop loss in lanka villages in east godavari
ఓ వైపు కరోనా వైరస్ ప్రభావం, మరోవైపు వాతావరణ మార్పులు అరటి రైతులను కష్టాల్లోకి నెట్టాయి. తూర్పుగోదావరి జిల్లాలోని లంక ప్రాంతాల్లో ఈదురుగాలుల కారణంగా అరటి పంట ధ్వంసమైంది. అసలే ఎగుమతులు నిలిచిపోయి ఇబ్బందులు పడుతుంటే.. ఇప్పుడు ఈదురుగాలులు తమను అప్పుల ఊబిలోకి నెట్టాయని కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈదురుగాలులతో ఆలమూరులో అరటి తోటలు ధ్వంసం