లాక్డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలకు... తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో బాదె వాసు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కూరగాయలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఇప్పటివరకు 5వేల మందికి సరుకులు పంపిణీ చేశామని సంస్థ వ్యవస్థాపకులు బాదే గోవింద్ తెలిపారు. అంతేకాకుండా మూగజీవాలకు సైతం ఆహారాన్ని అందిస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు ట్రస్ట్ సభ్యులు.
పేదల ఆకలి తీరుస్తున్న బాదె వాసు చారిటబుల్ ట్రస్ట్ - కాకినాడలో పేదలకు ఆహార పంపిణీ వార్తలు
లాక్డౌన్ కారణంగా ఇబ్బందులకు గురవుతున్న పేద ప్రజలు ఆకలి తీర్చేందుకు ముందుకొచ్చింది తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన బాదె వాసు చారిటబుల్ ట్రస్ట్. పేదలకే కాకుండా మూగజీవాలకు సైతం ఆహారాన్ని అందిస్తుంది ఈ ట్రస్ట్.
పేదల ఆకలి తీరుస్తున్న బాదె వాసు చారిటబుల్ ట్రస్ట్