తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి మండలంలో ఈరోజు కొత్తగా ఐదు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి మండలంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 21కి చేరింది. ఈ మేరకు శనివారం నుంచి మండలం అంతటా రెడ్‌జోన్ ఆంక్షలు అమలు చేయనున్నట్లు అమలాపురం ఆర్డీవో బీహెచ్ భవానీ శంకర్ వెల్లడించారు. కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న కారణంగా ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. లాక్డౌన్ పూర్తిస్థాయిలో అమలు చేయనున్నట్లు తెలిపారు.
రెడ్‌జోన్‌గా అయినవిల్లి మండలం
తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి మండలం అంతటా శనివారం నుంచి రెడ్‌జోన్ ఆంక్షలు అమలు చేయనున్నట్లు అమలాపురం ఆర్డీవో హెచ్ భవానీశంకర్ వెల్లడించారు. మండలంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న కారణంగా ఈ చర్యలు తీసుకున్నట్లు ఆర్డీవో తెలిపారు.
అయినవిల్లి మండలంలో ఐదు పాజిటివ్ కేసులు నమోదు
మండలంలో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు నిత్యావసర సరకులు, కాయగూరల దుకాణాలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. అనంతరం వాటిని మూసివేయాలని దుకాణ యజమానులకు తెలిపారు. కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా ప్రజలు ఎవరికి వారు స్వీయ జాగ్రత్తలు పాటించాలని ఆర్డీవో భవాని శంకర్ విజ్ఞప్తి చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదీ చూడండి:40 అడుగుల బావిలో పడిన ఒంటె- ఎట్టకేలకు బయటికి
Last Updated : Jun 13, 2020, 8:38 AM IST