ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఓటు హక్కు వినియోగంపై అవగాహన ర్యాలీ - పుదుచ్చేరిలో ఓటు హక్కుపై అవగాహన ర్యాలీ

పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. అధికార యంత్రాంగం వంద శాతం ఓటింగ్ జరిగేలా చర్యలు చేపట్టింది. విద్యార్థులు, బుర్రకథల కళాకారులతో ప్రచారాలను నిర్వహిస్తోంది.

యానాంలో ర్యాలీ నిర్వహిస్తున్న బుర్రకథల కళాకారులు, విద్యార్థులు
యానాంలో ర్యాలీ నిర్వహిస్తున్న బుర్రకథల కళాకారులు, విద్యార్థులు

By

Published : Mar 30, 2021, 7:18 PM IST

కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంపై... అధికార యంత్రాంగం ఏర్పాట్లు ముమ్మరం చేస్తోంది. వంద శాతం ఓటింగ్ జరిగేలా చర్యలు చేపట్టింది. విద్యార్థులతో ర్యాలీలు.. బుర్రకథ కళాకారులతో ప్రచారాలను నిర్వహిస్తున్నారు.

యానాం రిటర్నింగ్ అధికారి అమన్ శర్మ... తన కార్యాలయం వద్ద జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. 'ఓటును నోటు కి అమ్ముకోవద్దు.. అభ్యర్థులు అందించే మందుకు చేరువ కావద్దు' అంటూ బుర్రకథ కళాకారులు... ఓటు చాలా పవిత్రమైనది సమర్థమైన నేతకే వేయండి అంటూ విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శించారు.

ABOUT THE AUTHOR

...view details