తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలో కరోనా వైరస్ వ్యాప్తిపై స్థానికులకు అధికారులు అవగాహన కల్పించారు. వ్యాపారుల వద్దకు వెళ్లి సామాజిక దూరం పాటించే విధంగా సర్కిల్ ఏర్పాటు చేయాలని సూచించారు. సర్కిల్లో నిలబడి సరకులు కొనుగోలు చేయాలని కోరారు. కోనసీమ వ్యాప్తంగా పారిశుద్ధ్య చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి. నిత్యం పన్నెండు వందల మంది కార్మికులు ఈ పనుల్లో నిమగ్నమవుతున్నారని అధికారులు చెబుతున్నారు.
కరోనా వ్యాప్తి నియంత్రణకు అవగాహన కార్యక్రమం - lock down on konaseema
వేగంగా వ్యాపిస్తున్న కరోనా మహమ్మారిని నియంత్రించడానికి అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో ఉన్న ప్రజలకు వ్యక్తిగత శుభ్రత, స్వీయ నిర్బంధం, సామాజిక దూరం వంటి అంశాలపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించారు.
కోనసీమలో కరోనా వ్యాప్తి నియంత్రణకు అవగాహన కార్యక్రమం