కరోనా కట్టడికి తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడులో.. పోలీసులు వినూత్న ప్రచారం చేపట్టారు. ప్రధాన రహదారిపై చిత్ర పటాలు, సందేశాలతో ప్రజలను చైతన్యం చేస్తున్నారు. మన కోసం మన అందరి కోసం ఇంటిపట్టునే ఉండాలనే సందేశాన్ని ప్రజలకు చేరవేస్తున్నారు. ఈ వైరస్ నియంత్రణలోకి వచ్చే వరకూ ప్రజలంతా లాక్‌డౌన్ ఆంక్షలను గౌరవించాలని కోరారు. ఇళ్లకే పరిమితం కావాలన్నారు.
కరోనా చిత్రపటం.. అందరికీ సందేశం - తూర్పుగోదావరిలో కరోనా బొమ్మలతో లాక్డౌన్పై అవగాహన
ప్రత్తిపాడు పోలీసులు వినూత్న రీతిలో.. కరోనా వైరస్ పై అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. వైరస్ బొమ్మను గీసి.... లాక్ డౌన్ ఆవశ్యకతను ప్రజలకు తెలియజేశారు.
Awareness on lockdown with Corona diagrams at prathipadu in East Godavari