కరోనా నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లా తునిలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. నిత్యావసర సరుకుల కొనుగోలుకు సడలింపు ఇస్తున్న సమయంలో ప్రజలు పెద్ద సంఖ్యలో మార్కెట్‌కు వస్తున్నారు. వారిలో కొందరు ప్రభుత్వం సూచిస్తున్న జాగ్రత్తలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ కారణంగా.. ఆయా ప్రాంతాల్లో మైక్‌ల ద్వారా అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. మార్కెట్లో అన్ని ప్రాంతాలు తిరుగుతూ చైతన్యం తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
'అందరూ వినండి.. సామాజిక దూరం పాటించండి' - తునిలో కరోనా వైరస్‌పై అవగాహన
కరోనా వైరస్ మహమ్మారి నుంచి తప్పించుకునేందుకు తూర్పు గోదావరి జిల్లాలోని అధికారులు అన్ని విధాల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలోని తుని మార్కెట్లో నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసేందుకు అధిక సంఖ్యలో వస్తున్న ప్రజలు సామాజిక దూరం పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అలాంటి వారి కోసం ఆయా ప్రాంతాల్లో మైక్‌ల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు.
కరోనా వైరస్‌పై మార్కెట్లలో ప్రజలకు అహగాహన